English   

ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్

RRR
2021-06-29 12:13:39

జూనియర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది..దాంతో విడుదలకు నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన ను చిత్ర బృందం విడుదల చేసింది. దాని ప్రకారం సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ పూర్తి అయినట్ల వెల్లడించింది. అంతే కాకుండా ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి గారు స్వరాలు సమకూరుస్తున్నారు. సముద్రఖని ,అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు .డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు . మరికొద్ది రోజుల్లో లో ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.

More Related Stories