English   

 హనుమాన్ గుడిని పూర్తి చేసిన యాక్ష‌న్ హీరో

Arjun Sarja
2021-06-29 16:45:43

యాక్షన్ హీరో అర్జున్ మొదట తమిళ సినిమాలతో పరిచయం అయ్యి, ఆ తర్వాత చాలా భాషల్లో నటించాడు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఈ హీరో తమిళనాడులోని చెన్నై పట్టణంలో ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లో షేర్ చేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.... ఈ గుడిని పదిహేను సంవత్సరాల క్రితమే ప్రారంభించాము. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత  పూర్తి అయ్యింది. ఈ గుడి  కుంభాభిషేకం జూలై 1,2 తారీకుల్లో జరుగుతుంది. దీనిని బంధువులు, స్నేహితులు, ఫ్యాన్స్ అందరి సమక్షంలో జరపాలి అనుకున్నాను. కానీ కరోనా వల్ల అది కుదరడం లేదు. అందుకు చాలా బాధగా ఉంది. కానీ అందరూ ఈ వేడుకను చూసే విధంగా లైవ్ స్ట్రీమింగ్ నీ ఏర్పాటు చేస్తున్నాను. మీరు కుంభాభిషేకం చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. అంటూ అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం అర్జున్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'సర్కార్ వారి పాట' సినిమాలో నటిస్తున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి.
 

More Related Stories