English   

బాల‌య్య నిర్మాత‌పై కేసు

 C Kalyan
2021-06-29 16:50:09

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇదివరకే భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ అవి కేవలం ఆరోపణలేనని తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏదైనా అన్నారు. కానీ తాజాగా మరోసారి ఈ నిర్మాత పై భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి . వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ లోని ఒక భూ వివాదానికి సంబంధించి సి.కళ్యాణ్ పై గోపి కృష్ణ అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సీ కళ్యాణ్ పంపించారని ముగ్గురు వ్యక్తులు వచ్చి తమ ఇంటికి తాళాలు వేశారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. దాంతో నిర్మాత తో పాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సి.కళ్యాణ్ బాలకృష్ణతో అనేక సినిమాలు నిర్మించాడు. అందుకే ఇండస్ట్రీలో చాలామంది ఈయనను బాలకృష్ణ ప్రొడ్యూసర్ అని పిలుస్తుంటారు . బాలకృష్ణ హీరోగా నటించిన 'రూలర్' సినిమాను సి కళ్యాణ్ చివరగా నిర్మించారు.

More Related Stories