English   

ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కోసం బెల్లంకొండ హోం వ‌ర్క్

Bellamkonda Sreenivas
2021-06-30 07:48:24

వివి వినాయక్ దర్శకత్వంలో 'అల్లుడు శీను' సినిమా తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ హీరో హిట్, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సమానమైన బడ్జెట్ సినిమాలలో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఎంత భారీ బడ్జెట్ సినిమాలలో నటించినా బెల్లంకొండ కు 2019 లో విడుదలైన 'రాక్షసుడు' సినిమా తప్ప వేరే ఏవి కూడా అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేసిన  'అల్లుడు'  అదుర్స్ సినిమా కూడా నిరాశపరిచింది. ఈ  సినిమాకు ముందే బెల్లంకొండ  'చత్రపతి' సినిమా బాలీవుడ్ రీమిక్ లో నటిస్తున్నానని దానిని వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల షూటింగ్ మొదటి షెడ్యూల్  ప్రారంభించే ఉద్దేశంలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ కు గ్యాప్ రావ‌డంతో శ్రీనివాస్ బాలీవుడ్ లుక్ కోసం కసరత్తు చేస్తున్నట్లుగా గుసగుసలు వినపడుతున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ సినిమా రీమేక్ కావ‌డంతో బెల్లంకొండ ప్ర‌స్తుతం హిందీ నేర్చుకునే ప‌నిలో కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది.  ఇక ఈ సినిమా కోసం కొంతమంది నటీనటుల ఎంపిక ప్ర‌క్రియ కూడా జ‌రుగుతోంద‌ట‌. మరి బెల్లంకొండ, వివి వినాయక్ కాంబినేషన్ బాలీవుడ్ లో ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి. 

More Related Stories