English   

విశ్వక్ సేన్ సినిమాలో ర‌కుల్

 Rakul Preet
2021-06-30 11:33:42

తమిళ ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో విశ్వక్ సెన్ హీరో గా 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో హీరో తో పాటు నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు , అందుకోసం దర్శకుడు నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ మౌనిక జాన్, మేఘ ఆకాష్ లను తీసుకున్నారు. వీటితో పాటు ఒక ప్రధాన పాత్రలో నటించడానికి దర్శకుడు రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. దీనినే థియేటర్ రిలీజ్ కోసం కాకుండా ఒక ప్రముఖ 'ఓటీటీ' సంస్థ కోసం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే దర్శకుడు ఎల్ విజయ్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'తలైవి' అనే చిత్రాన్ని పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా హీరోయిన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి తమిళ రాజకీయాలను శాసించే విధంగా ఎదిగిన జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. విశ్వక్ సెన్ కూడా ప్రస్తుతం 'పాగల్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది. దీనికి సంబంధించిన టీజర్ పాటలు ఇప్పటికే విడుదల అయ్యి మంచి ఆదరణ తెచ్చుకున్నాయి.

More Related Stories