English   

సురేష్ బాబుపై ఆగ్రహంగా థియేటర్ల‌ యాజమాన్యం

Suresh Babu
2021-06-30 17:32:42

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్, నిర్మాత సురేష్ బాబు మీద థియేటర్ల‌ యాజమాన్యం సంఘాలు, నిర్మాణాలు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి కారణం. 'నారప్ప'  'దృశ్యం 2,  విరాట పర్వం' సినిమాలను ఓటిటి లకు అప్ప‌జెప్పె ఆలోచ‌న‌లో ఉండటమే. మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం  'దృశ్యం 2' ను నేరుగా 'ఓటిటి' లోనే విడుదల చేయడం జరిగింది. దాని రీమేక్ అయిన తెలుగు 'దృశ్యం 2 ని ఓటిటి విడుదల చేయడాన్ని పెద్దగా ఎవరూ నిరాకరించడం లేదు ఎందుకంటే ఒరిజినల్ సినిమా  కూడా  'ఓటిటి' లోనే విడుదలయ్యింది. కానీ 'నారప్ప' లాడ్జ్ స్కేల్  సినిమా అని మొదటి నుండి సురేష్ బాబు చెబుతూ వచ్చాడు.  

ఇది తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అసురన్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ధనుష్ నటించిన ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఇలాంటి సినిమాలు 'ఓటిటి కి అమ్మడం అంటే థియేటర్లను చంపడమే అని వారి థియేట‌ర్ యాజ‌మాన్యాలు భావిస్తున్నాయి. మరియు  సెకండ్ వేవ్ ముందు 'విరాట పర్వం' విడుదల తేదీని కూడా ఖరారు.  ఆ తర్వాత వాయిదా వేశారు. ఇప్పుగు ఆ సినిమాను ఇప్పుడు 'ఓ టి టి 'లో విడుదల చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్ర‌శ్న కూడా వ‌స్తుంది. 

ఇప్పటికే థియేటర్ల మనుగడ ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటే సినిమా మీద సినిమా పరిశ్రమ మీద ఇంత జ్ఞానం ఉన్న సురేష్ బాబే ఇలా చేయడం వల్ల వారు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నేరుగా ఎవరూ ఏమీ అనలేక 'సేవ్ థియేటర్స్ క్యాంపెయిన్' ప్రారంభం చేశారు. దీనిలో భాగంగా జూలై నెలాఖరులో గా అన్ని థియేటర్లు తెరుచుకుంటాయని ఆంధ్రాలో జూలై 10 నుంచి థియేటర్లు ఓపెన్ చేస్తామని దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రొడ్యూసర్లు సినిమాలు  ఓటిటిలకు అమ్మకుండా ఉండగలరని తెలియజేశారు.

More Related Stories