English   

ప‌వ‌న్ కోసం మ‌రో భారీ సెట్

 Pawan Kalyan
2021-07-01 11:04:58

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా త‌ర‌వాత ఇక‌పై సినిమాలు చేయను పూర్తి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తున్నాను అని ప్రకటించాడు . దాంతో ఫ్యాన్స్ మా హీరో ని ఇకపై వెండితెరమీద చూడడం కుదరదేమో అని అని తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఫ్యాన్స్ ని ఏమాత్రం నిరాశ పరచడం ఇష్టంలేని పవన్ కళ్యాణ్ తిరిగి నేను సినిమాల్లోకి వస్తున్నాను. అని ప్రకటించి వారికి కొండంత ఆనందాన్ని నింపాడు. ఈ వార్తలు రావడమే మొదలు ప్రొడ్యూసర్లు పవన్ కళ్యాణ్ దగ్గర 'క్యూ' కట్టేశారు, దానిలో భాగంగానే మొదట దిల్ రాజు నిర్మాణంలో 'వకీల్ సాబ్' సినిమాలు పూర్తి చేశాడు . 

దీనితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ప్రస్తుతం పవన్, క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే చార్మినార్ సెట్ వేసిన విషయం మనకు తెలిసిందే ,అయితే ఇప్పుడు మరొక భారీ సెట్ ని వేసే పనిలో చిత్ర బృందం ఉంది. హైదరాబాద్ శివారులో భారీ ఎత్తున ఆగ్రా కోట సెట్ ని వేస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది ,కానీ బడ్జెట్ అనుకున్న దానికంటే 25 కోట్ల వరకు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిల్మీ టాక్ . ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నారు.

More Related Stories