ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు దివంగత నందమూరి తారక రామారావు 'టిడిపి పార్టీ' ని స్థాపించారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పార్టీ బాగానే ఎదిగింది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరమైన ఓటమిని చూడాల్సి వచ్చింది.అనంతరం స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపి కి ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. దానితో రాజకీయ విశ్లేషకులు మరియు సాధారణ ప్రజలు ఈ సమయంలో టిడిపిని బలోపేతం చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడి వల్లే అవుతుందను అభిప్రాయపడ్డారు.
వీటికి బలం చేకూరుస్తూ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు అయిన బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారాయి. సీనియర్ ఎన్టీఆర్ పార్టీని పెట్టినప్పుడు జనాలు విపరీతంగా వచ్చేవారిని వారి మాటలను , వ్యక్తిత్వాన్ని ఇష్టపడే వారని అదే తత్వం జూనియర్ ఎన్టీఆర్ లో కూడా ఉందని.. 2009 ఎలక్షన్లలో జూనియర్ ఎన్టీఆర్ 'తెలుగుదేశం పార్టీ' తరఫున క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా జనాలు విపరీతమైన ఆసక్తి చూపారని అన్నారు. 'పార్టీ' బలపడాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలని తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ టీడీపీ నుండి పోటీ చేసి గెలుస్తారో లేదంటే ఇతర పార్టీల నుండి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో చూడాలని అన్నారు.