English   

యామీ గౌతమ్ కు ఈడీ షాక్‌

Yami Gautam
2021-07-02 16:07:36

హీరోయిన్ యామి గౌతమ్ కు మరోసారి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో అధికారులు నోటీసులు జారీ చేశారు. విదేశీ మారక నిర్వహణ చట్టం ఫెమా ఉల్లంఘించినట్లు ఈడి ఆరోపణలు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా ఆర్థిక అవకతవకలకు సంబంధించిన హీరోయిన్ స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి వచ్చేవారం విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇక ఇదివరకే యామి గౌతమ్ కు ఒకసారి ఈఢీ నోటీసులు జారీ చేసింది. 

కాగా ఇది రెండోసారి. ఇటీవలే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ భామకు నోటీసులు ఇవ్వడం తో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా యామి గౌతమ్ తెలుగులో నువ్విలా, కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన కాబిల్ సినిమాలోనూ నటించింది అంతేకాకుండా వరుణ్ ధావన్ హీరోగా నటించిన బాధ్లాపూర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఇక ఇటీవల బాలీవుడ్ లో మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈడీ విచారించగా ఇప్పుడు యామి గౌతమ్ ను కూడా విచారించనుంది.

More Related Stories