English   

వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పిన అమీర్ ఖాన్ దంపతులు

Aamir Khan Kiran Rao
2021-07-03 12:22:44

సెలబ్రిటీ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నా... పెద్దలు నిశ్చయించి పెళ్లి చేసినా విడిపోవడం సాధారణమైపోయింది. ఇక బాలీవుడ్ లో అయితే ఎప్పుడు కలిసి ఉంటారో... ఎప్పుడు విడిపోతారో చెప్పలేం. తాజాగా అమీర్ ఖాన్ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము విడాకులు తీసుకున్నట్టు అమీర్ ఖాన్ మరియు అతని భార్య కిరణ్ రావు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. 

15 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు.... ఇకపై భార్యాభర్తలుగా కాకుండా సహ తల్లిదండ్రులు గా మరియు కుటుంబ సభ్యులుగా ఉంటామని ప్రకటించారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ దంపతులు విడాకుల వార్త సంచలనంగా మారింది. ఇన్ని ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఇలా ప్రకటించడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. హీరో హృతిక్ రోషన్ కూడా తన భార్య నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో అమీర్ ఖాన్ కూడా చేరిపోయారు.

More Related Stories