భర్తను గ్రాండ్ ఫాదర్ అన్న నెటిజన్..షాకింగ్ రిప్లై ఇచ్చిన సునీత

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పెట్టే పోస్టులుకు, ఫోటోలకు నెగిటివ్ కామెంట్స్ రావడం సహజం . ఇలాంటి కామెంట్లను కొంత మంది సెలబ్రెటీలు చాలా లైట్ గా తీసుకుంటారు. ఎందుకంటే వాటిని పట్టించుకోవడం టైం వేస్ట్ అని వారి అభిప్రాయం. కానీ కొంతమంది సెలబ్రెటీలు మాత్రం చాలా స్ట్రాంగ్ కౌంటర్ లు ఇస్తారు. అదే పని ఇప్పుడు సింగర్ సునీత కూడా చేసింది. ఈ మధ్య కాలంలో లో సునీత తన భర్త రామ్ తో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దానికి ఒక వ్యక్తి గ్రాండ్ ఫాదర్ అండ్ ఆంటీ కలిసి దిగిన ఫోటో అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ చేశాడు.
ఈ కామెంట్ ను చూసిన సింగర్ సునీత అతడికి దిమ్మదిరిగేలా సమాధానం ఇచ్చింది. గాడ్ బ్లెస్ యు నాన్న నువ్వు శరీరం విషయంలోనే కాకుండా మనిషిగా కూడా ఎదగాలి అని కోరుకుంటున్నాను. నీలాంటి వ్యక్తిత్వం ఉన్న నా వాడితో కలిసి జీవిస్తున్న నీ కుటుంబ సభ్యులను చూస్తే నాకు జాలి వేస్తుంది. నీతో కలిసి తిరుగుతున్నస్నేహితులు ఇలా అవ్వకూడదు. అని కోరుకుంటున్నా. అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక సునీత రిప్లై కు కొంత మంది నెటిజన్లు సూపర్ కౌంటర్ ఇచ్చారు మేడం అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పెళ్లి తరవాత కూడా సునీత టీవీ షోలలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ఇప్పడు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.