English   

 పవన్ కోసం కథను రెడీ చేసిన బాహుబలి రైటర్  

rajamouli
2021-07-03 15:33:18

మోస్ట్ వాంటెడ్ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్.. పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తనయుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో పాటుగా 'తలైవి' 'సీత' వంటి చిత్రాలకు కథలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో చేయబోయే చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసి బాధ్యత తీసుకున్నారు.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు విజయేంద్రప్రసాద్.. ఓ కథను పవన్ కళ్యాణ్‌కి వినిపించారని, అది ఆయనకు తెగ నచ్చేసిందట. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైందట. కథ అయితే నచ్చింది కానీ దాన్ని తెరకెక్కించేది ఎవరు? అనే ప్రశ్న మొదలైందట. అయితే దర్శక నిర్మాతలను తానే సెలెక్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారట. దీంతో స్టార్ రైటర్ కథలో పవన్ కళ్యాణ్‌ను హీరోగా త్వరలోనే తెలుగు ప్రేక్షకులు చూడబోతోన్నారన్న మాట. వీటిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

More Related Stories