English   

శాసనసభ ఎదుట నగ్నంగా సంపూర్ణేష్ బాబు 

Sampoornesh Babu
2021-07-03 16:09:36

సింగం 123, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం ఈ బర్నింగ్ స్టార్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇప్పటకే సంపూర్ణేష్ బాబు.. ‘బజార్ రౌడీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

మరోవైపు  సంపూర్ణేష్ బాబు. .‘క్యాలీఫ్లవర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా సంపూ... ఇంగ్లీష్ దొరబాబు గెటప్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. అలాగే రీసెంట్ గా శ్రీరాముడి గెటప్‌లో విల్లు ఎక్కుపెడుతున్న  ఉన్న స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసి సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు తెలిపారు. 

ఇక తాజాగా  శాసనసభ ఎదుట నగ్నంగా నిలుచొని క్యాలీఫ్లవర్ అడ్డుపెట్టుకున్న పోస్టర్ ను విడుదల చేసారు.  శాసనసభ ఎదుట క్యాలీఫ్లవర్ సాక్షి గా అనే టైటిల్ పెట్టారు. ఉన్నారు. దీనికి ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో సంపూర్ణఏస్ బాబు విదేశాల నుంచి మన దేశానికి వచ్చి స్త్రీ గౌరవాన్ని పవిత్రతను చెప్పే ఇంగ్లీష్ దొర పాత్రలో సంపూ కనిపించనున్నారు. వసంతి ఈ సినిమాలో సంపూకు జోడిగా నటించింది. ఆర్.కే.మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఆశాజ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 

More Related Stories