ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్

సింగర్ చిన్మయి తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా తన గొంతుతో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమందిని అలరించింది. ఇలా అద్భుతం గా తన కెరీర్ సాగుతున్న సమయంలోనే 'అందాల రాక్షసి' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన రాహుల్ రవిచంద్రన్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతే రాహుల్ 'చిలసౌ' సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అయితే చిన్మయి కేవలం పాటలు మాత్రమే పాడటం కాకుండా మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలపై కూడా ఘాటుగా స్పందిస్తారు. కోలీవుడ్ స్టార్ రైటర్ అయిన వైరముత్తు లాంటి వారిని కూడా విమర్శిస్తూ మహిళల తరపున నిలబడ్డ వ్యక్తి గా చిన్మయి నిలిచింది.
ఇక ఇప్పుడు చిన్మయి సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించింది. ఇటీవల కాలంలో రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి చిన్మయి చీర కట్టుకుని వెళ్ళింది. ఈ చీర కట్టు విధానం బేబీ బంప్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో చిన్మయి తొలి బిడ్డకు జన్మనిస్తుంది అంటూ యూట్యూబ్ లో ఇతర సాంఘిక మాధ్యమాలలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన చిన్మయి తాను ప్రెగ్నెంట్ కాదని అలాంటి రూమర్స్ ని ఎవరూ స్ప్రెడ్ చేయకండని కోరింది.