English   

ప్రియుడితో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న మెహరీన్

Mehreen
2021-07-03 17:42:50

హీరోయిన్ మెహరిన్ కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో తెలుగులో వరస ఆఫర్లను చేజిక్కించుకుంది . 2019 సంక్రాంతికి విడుదలైన 'ఎఫ్ 2' సినిమా తో మంచి విజయం అందుకుంది. ఇలా తన కెరియర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే భవ్య బిష్ణోయ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు... త్వరలోనే తమ ఎంగేజ్మెంట్ అని, పెళ్లి అని తెలిపింది. దాంతో మెహరిన్ తో సినిమాలు చేయాలనుకునే ప్రొడ్యూసర్లు పెళ్లి తర్వాత మెహరీన్ సినిమాలు చేస్తుందో లేదో అని ముందుగానే డేట్స్ కూడా తీసుకున్నారు. 

ఇలా మెహరిన్ పెళ్లి వార్త ఫిల్మి దునియా లో చక్కర్లు కొడుతూ ఉండగానే ఈ హీరోయిన్ తన పెళ్లి గురించి సంచలన ప్రకటన చేసింది. తన ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకున్నట్టుగా, మరియు పెళ్లి కూడా చేసుకునే ఉద్దేశం లేనట్టుగా తెలిపింది. ఈ నిర్ణయం తన మనస్ఫూర్తిగా తీసుకున్నట్టు.. ఫ్యూచర్ లో కూడా భవ్య బిష్ణోయ్ ఫ్యామిలీతో గాని ఫ్రెండ్స్ తో ఎటువంటి సంబంధం పెట్టుకోనని తెలిపింది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానను అంటూ పేర్కొంది. అంతే కాకుండా సినిమాలలో కూడా కొనసాగుతాను అని తెలిపింది. ప్రస్తుతం మెహరీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఎఫ్ 3' లో ఒక హీరోయిన్ గా నడుస్తుంది.

More Related Stories