English   

దిల్ రాజు తో కళ్యాణ్ రామ్.. ఇట్స్ అఫీషియల్

Kalyan Ram
2021-07-05 12:22:18

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ నుండి ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. అందులో కళ్యాణ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమాను అనౌన్స్ చేసి నందమూరి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. పోస్ట్ లో ....మా సంస్థలో మీరు హీరోగా నటించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. ఇక ఈ చిత్రానికి కె.వి.గుహన్ దర్శకత్వం వహించబోతున్నారు. అంతే కాకుండా శిరీష్ , దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు కెవి గుహన్ ఇదివరకే కళ్యాణ్ రామ్ తో '118' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోన్ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఈ కాంబినేషన్ సినిమా అనగానే ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'బింబిసార' అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ లో సినిమా పట్టలెక్కే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories