English   

మిష‌న్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయిన తాప్సీ ప‌న్ను

Taapsee Pannu
2021-07-06 12:07:46

టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒక‌వైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మ‌రోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప‌తాకంపై ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ ఎస్ జె ద‌ర్శ‌కత్వంలో ప్రొడ‌క్ష‌న్ నెం.8గా ఓ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో పాటు ఇటీవ‌ల విడుద‌ల‌చేసిని థీమ్ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు మేక‌ర్స్‌. 2017లో వచ్చిన సూప‌ర్‌హిట్ ఫిల్మ్ `ఆనందో బ్రహ్మ` సినిమాలో చివ‌ర‌గా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తాప్సీ తాజాగా మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో లీడ్‌రోల్‌లో న‌టిస్తోంది.

ఈ రోజు నుండి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్క‌మ్ చెప్పింది చిత్ర యూనిట్‌. అలాగే చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ - ``గత 7 సంవత్సరాలుగా ఒక‌ ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. మిషన్ ఇంపాజిబుల్ అలాంటి చిత్రాల్లో ఒక‌టి. ఆకట్టుకునే కథాంశం మ‌రియు మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ కావ‌డంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాల‌లో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిల‌బెట్టుకోగ‌ల‌ను అని న‌మ్ముతున్నాను`` అన్నారు.

More Related Stories