English   

పుష్ప షూటింగ్ మొదలు పెట్టిన పుష్పరాజ్

pushpa
2021-07-06 14:53:20

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ  'పుష్ప'.  ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా షూటింగ్ స్టార్ చేయాలని ప్లాన్ చేయగా కొన్ని అనుకోని కారణాలతో మరోసారి షూటింగ్ వాయిదా వేశారని విన్నాం. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన 'పుష్ప' సినిమా షూటింగ్ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై ప్రస్తుతం సికింద్రాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరిందని, మరో 45 రోజుల్లో 'పుష్ప' మొదటి భాగానికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని చిత్ర యూనిట్ అంటోంది. 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు సుకుమార్. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

More Related Stories