చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదుట పవన్ అభిమాని ఆత్మహత్యాయత్నం

2021-07-07 19:17:17
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తించారు. దీంతో హుటా హుటిన బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడికి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సదరు యువకుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు.