English   

ప్రకాష్ రాజ్‌ ట్వీట్‌..మా అధ్యక్షుడి కౌంటర్ 

Prakash Raj
2021-07-08 11:15:16

గతంలో కంటే ఈసారి 'మా' ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఇక అందరికంటే ముందే ప్రకాశ్‌రాజ్‌ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే సినీ పెద్దల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుండటంతో మా ఎన్నిక అంశం ఆసక్తికరంగా మారాయి.   

ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ ఎప్పుడు ? #Justasking అంటూ ప్రకాష్ రాజ్‌ చేసిన ట్వీట్‌ మాలో మరోసారి హీట్‌ పెంచేశాయి. ఇందుకు బదులుగా ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ కౌంటర్‌ రిప్లై ఇచ్చారు. నిబంధనలు, ప్రస్తుతమున్న కోవిడ్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మా ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాం. మెయిల్‌ కూడా పంపించాం. ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇదెలా ఉందంటే.. నీళ్లు నింపకుండానే  స్విమ్మింగ్ పూల్‌లో దూకుతాను అన్నట్టుగా ఉందంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్స్‌ వైరల్‌గా మారాయి.

More Related Stories