English   

బుట్ట బొమ్మతో నితిన్ రొమాన్స్ 

Pooja hegde
2021-07-08 12:26:34

వరుస సినిమాలతో బిజీ గా వున్న నితిన్ కి రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ వినిపించిన కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడట. దీనితో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి మాస్ లో తన క్రేజ్ పెంచుకోవాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. దీనికోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.  ఈ చిత్రంలో నితిన్ సరసన నటించేందుకు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పూజా ఇప్పటికే ఈ చిత్రానికి సైన్ కూడా చేసేసిందట. ఈ చిత్రం కోసం పూజాకి భారీ రెమ్యూనరేషన్ ముట్టినట్టు సమాచారం. 

అలాగే ప్రస్తుతం నితిన్ నటించిన మాస్ట్రో చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తుండగా.. ఇస్మార్ట్ బ్యాటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల సమర్పణలో ఎన్. సుదాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన అంధాదూన్ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నితిన్ అంధుడైన పియానో ప్లేయర్ గా కనిపించనున్నారు.

More Related Stories