English   

పన్నా అడవుల్లో దర్శకుడు తేజ మ్యూజిక్‌ సిట్టింగ్స్ 

Teja
2021-07-08 15:50:52

ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్‌ను దర్శకుడు తేజ  పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ చిత్ర యూనిట్‌  మధ్యప్రదేశ్‌లోని పన్నా అడవుల్లో సంగీత చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు. ‘‘ఆర్‌.పి.పట్నాయక్‌, చంద్రబోస్‌, తేజ ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి ‘‘రాబోయే చిత్రానికి ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ కుకింగ్‌ మొదలైంది. వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తుంటాం. సిద్ధంగా ఉండండి’’ అని ఆర్‌.పి.పట్నాయక్‌ తెలిపారు.  చాలా కాలం తర్వాత తేజ ఆర్ పి పట్నాయక్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా మ్యూజికల్ గా పెద్ద హిట్ అని చెపుకుంటున్నారు. ‘అహింస’ అనే టైటిల్ తో యాక్షన్ థిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

More Related Stories