English   

కత్తి మహేష్‌ కన్నుమూత 

Kathi Mahesh Dies
2021-07-10 17:57:18

సినీనటుడు, విమర్శకులు కత్తి మహేష్‌ కన్నుమూశారు. రెండు వారాలుగా చెన్నై అపోలో ఆస్పత్రి ఐసీయూ లో కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. తాజాగా  పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.రెండు వారాల క్రితం కత్తి మహేష్‌ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద ప్రమాదానికి గురైంది.  సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కత్తి మహేష్‌ నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే ఆయనకి చికిత్స చేస్తున్నారు. కత్తి మహేష్‌ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. శనివారం కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

More Related Stories