English   

శ్రీవిష్ణు, చైత‌న్య దంతులూరి, వారాహిచ‌ల‌న చిత్రం కాంబినేష‌న్ మూవీ `భ‌ళా తందనాన‌`… షూటింగ్ పునః ప్రారంభం

sree-vishnu-chaitanya-dantuluri-vaarahi-chalana-chitrams-bhala-thandanana
2021-08-10 17:48:46

యంగ్ హీరో శ్రీవిష్ణు,`బాణం` ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న డిఫ‌రెంట్‌ చిత్రానికి `భ‌ళా తందనాన‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శ్రీవిష్ణు ఇది వ‌ర‌కెప్పుడూ చేయ‌ని ఓ వైవిధ్య‌మైన పాత్ర‌లో చూపించ‌డానికి అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ చైత‌న్య దంతులూరి సిద్ధం చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత‌, ఈ సినిమా షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో పునః ప్రారంభ‌మైంది. త‌గు భ‌ద్ర‌తా చర్య‌ల‌ను తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జినీ కొర్ర‌పాటి `భ‌ళా తందనాన‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీవిష్ణు జ‌త‌గా క్యాథ‌రిన్ ట్రెసా న‌టిస్తోంది. ఈమె పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతుంది. కె.జి.య‌ఫ్ చిత్రంలో త‌న‌దైన విల‌నిజంతో ఆక‌ట్టుకున్న రామ‌చంద్ర‌రాజు ఈ చిత్రంలో మెయిన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలో ఐదు పాట‌లున్నాయి. సురేశ్ రుగుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా రైట‌ర్. మార్తాండ్ కె.వెంక‌టేశ్ ఎడిట‌ర్. గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

శ్రీవిష్ణు, కెథ‌రిన్ ట్రెసా, రామ‌చంద్ర‌రాజు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ‌: సాయి కొర్ర‌పాటి, బ్యాన‌ర్‌: వారాహి చ‌ల‌న చిత్రం, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌, సినిమాటోగ్ర‌ఫీ: సురేశ్ ర‌గుతు, ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌, ర‌చ‌న‌: శ్రీకాంత్ విస్సా, వారాహి టీమ్‌: భాను ప్ర‌కాశ్‌, బాబీ చిగురుపాటి, నిర్మాత‌: ర‌జినీ కొర్ర‌పాటి, ద‌ర్శ‌క‌త్వం: చైత‌న్య దంతులూరి.

More Related Stories