English   

ఐదు భాషల్లో విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప- ది రైజ్’ తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’

allu-arjuns-pushpa-first-single-released
2021-08-13 20:32:04

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప’. ఆగస్టు 13 ఉదయం 11:07 నిమిషాలకు 5 భాషల్లో ‘పుష్ప-ది రైజ్’ తొలి సింగిల్ విడుదలైంది. 

పాట విడుదలైన మరుక్షణం నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. నోటిలో కత్తి పెట్టుకొని ఐకాన్ స్టార్ చేసిన డాన్స్ లకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. 

ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా ‘పుష్ప- ది రైజ్’ విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

More Related Stories