English   

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అప్పిరెడ్డి ఫౌండేషన్, సోహి హెల్పింగ్ హ్యాండ్స్ సేవా కార్యక్రమాలు

charity-programs-on-the-occasion-of-megastar-chiranjeevis-birthday
2021-08-21 22:31:01

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అప్పిరెడ్డి ఫౌండేషన్, సోహిహెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు శనివారం హైదరాబాద్ నగరంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. అప్పిరెడ్డి ఫౌండేషన్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డితోపాటు, సోహి హెల్పింగ్ హ్యాండ్స్, మైక్ మూవీస్, మైక్ టీవీ సంస్థల ప్రతినిధులు చక్రధర్ రావు, రవి రెడ్డి, చరిత్, సంపత్, జగ్గూ పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడివారికి అన్నదానంతోపాటు పళ్లు ఫలహారాలు అందించారు.

 చిరంజీవి చిరకాలం ఆయురోరాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవలో చిరంజీవి తమకు ఆదర్శమని కొనియాడారు. చీర్ ఫౌండేషన్ (కైతలాపూర్), శ్రీ ఆదర్శ్ ఫౌండేషన్(మోతీ నగర్), జీవోదయ ఆర్ఫనేజ్(మోతీ నగర్), మదర్స్ నెస్ట్ ఓల్డేజ్ హోమ్ (నేరేడ్ మెట్), ఆర్క్ ఆఫ్ ఏజెంలికా ఆర్ఫనేజ్ (కాప్రా), అభిసాయి దత్త ట్రస్ట్ (ఉప్పల్)లో ఈ సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

More Related Stories