English   

`భోళా శంక‌ర్‌`లాంటి మ‌న‌సున్న సోద‌రుడు మెగాస్టార్ చిరంజీవికి రాఖీ క‌ట్టిన కీర్తిసురేశ్‌

keerthi-rakhi-to-chiru
2021-08-23 20:06:21

ఆదివారం(ఆగ‌స్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు అలాగే ర‌క్షా బంధ‌న్ కూడా. ఈ సంద‌ర్భంగా చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `భోళా శంక‌ర్‌` సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. అలాగే నేష‌న‌ల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. `భోళా శంక‌ర్‌` చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు. సినిమా కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంది. ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ క‌ట్టి ``చెల్లెలంద‌రీ ర‌క్షాబంధం... అభిమానులంద‌రి ఆత్మ బంధం... మ‌న అంద‌రి అన్న‌య్య జ‌న్మ‌దినం.. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌...`` అంటూ ఆయ‌న‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. 

ఈ చిత్రంలో అన్నాచెల్లెల మ‌ధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ ..అన్నా చెల్లెలుగా ఆక‌ట్టుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన వీడియో మ‌న‌కు చాలా కాలం గుర్తుండిపోతుంది. అలాగే సినిమాలో వీరి మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేస్తుంది. `భోళా శంక‌ర్‌`లో చెల్లెలు పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర‌కు కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసుకోవ‌డమే కాదు, ర‌క్షా బంధ‌న్ రోజున ఈ సినిమాను అనౌన్స్‌మెంట్‌ను చేయ‌డ‌మ‌నేది క‌రెక్ట్ ఛాయిస్‌. ``ఈ ప‌విత్ర‌మైన రోజున మెగాస్టార్ చిరంజీవిగారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేయ‌డం ఆనందంగా ఉంది. మీతో క‌లిసి న‌టించ‌డ‌మ‌నేది నా క‌ల‌. ఈ అద్భుత‌మైన ప్ర‌యాణం ఎప్పుడు ఎదురువుతుందా! అని ఎదురుచూడ‌లేక‌పోతున్నాను. హ్యాపీ బ‌ర్త్ డే అన్న‌య్య‌`` అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేస్తూ కీర్తి సురేశ్ వీడియోను విడుద‌ల చేసింది.

ర‌క్షా బంధ‌న్ రోజున విడుద‌లైన ఈ వీడియోకు యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌హ‌తి సాగ‌ర్ ఆహ్లాద‌క‌ర‌మైన‌ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను చాలా స్టైలిష్‌గా తెర‌కెక్కిస్తాడ‌నే పేరున్న డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్.. ఈ `భోళా శంక‌ర్‌` సినిమాను ప్యామిలీ ఎమోష‌న్స్‌తో స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. చిరంజీవి, మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్‌లో ..అనీల్ సుంక‌ర త‌న ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అసోషియేష‌న్‌తో నిర్మిస్తోన్న `భోళా శంక‌ర్‌` మూవీ.షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ మోష‌న్ పోస్ట‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. యూట్యూబ్‌లో ఈ వీడియోట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఈ స్పెష‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లాయి.
 

More Related Stories