English   

త్వరలోనే ‘గల్లీరౌడీ’ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తాం: స‌మ‌ర్ప‌కుడు కోన వెంక‌ట్‌, నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

Gully Rowdy to release soon
2021-08-24 21:45:02

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గ‌ల్లీరౌడీ సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల కావ‌డం లేదు.

దీని గురించి మేక‌ర్స్ మాట్లాడుతూ ‘‘మా గల్లీరౌడీ’ని ముందుగా సెప్టెంబ‌ర్ 3న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే ఆరోజున బాక్సాఫీస్ వ‌ద్ద ఇత‌ర సినిమాలు కూడా ఎక్కువ‌గా పోటీప‌డుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టి, ఇప్పుడిప్పుడే ప్రేక్ష‌కులు సినిమా థియేటర్స్‌కు ధైర్యంగా వ‌చ్చి సినిమాల‌ను ఆద‌రిస్తున్న త‌రుణంలో, మంచి రిలీజ్ డేట్ కోసం ఆగితే మంచిద‌నే అభిప్రాయం క‌లిగింది. ఫ్రెండ్లీ ఎట్మాస్పియ‌ర్ అంద‌రి మ‌ధ్య ఉండాల‌ని భావించాం. అందువ‌ల్ల మా సినిమాను ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన‌ట్లు సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌డం లేదు. సెప్టెంబ‌ర్‌లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామ‌ని, త్వ‌ర‌లోనే ఆ రిలీజ్ డేట్‌ ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

More Related Stories