English   

ఆకాష్ పూరి చేతుల మీదుగా ‘బ్యాచ్’ ట్రైలర్ విడుదల

akash-puri-released-the-batch-movie-trailer
2021-08-26 21:48:19

ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా  శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్యాచ్’. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించారు. మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ బ్యాచ్ చిత్రాన్ని రమేష్ ఘనమజ్జి నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రం ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ తనయుడు పూరి ఆకాష్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ… “ట్రైలర్ చూసాను. చాలా ఆసక్తికరంగా ఉంది. రఘు కుంచే  సంగీతం చాలా హైలైట్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాత సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తాను అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా థియేటర్ లోనే విడుదల చేస్తాననటం గొప్ప విషయం, మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. సాత్విక్ చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా పాజిటివ్ గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతు ఉంటాడు. ఆల్ ది బెస్ట్ సాత్విక్. ఈ సినిమా మంచి విజయం సాదించాలి అన్నారు.

నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ… “నాకు నిర్మాతగా అనుభవం లేదు కానీ కథ నచ్చింది. మా దర్శకుడు శివని నమ్మి ఈ సినిమా తీశాం. మా చిత్రానికి సంగీతమే బలం. అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. రఘు కుంచే గారికి నా ధన్యవాదాలు. మా హీరో సాత్విక్ బాగా సపోర్ట్ చేసాడు. షూటింగ్ రోజులు పెరిగినా బాగా సపోర్ట్ చేసాడు. నటి నటులు అందరు సహకరించారు. మా చిత్రంలో ముగ్గురు కొత్త సింగర్స్ ని పరిచేయం చేసాం. అసిరయ్య గారి పాట విన్నారు. లక్ష్మి మరియు సాయి సంవిద్ లను పరిచయం చేశాం. మిగతా పాటలు కూడా త్వరలోనే విడుదల చేస్తాం. ఎడిటర్ జె పి, కెమెరా మాన్ వెంకట్ గారు బాగా సహాయం చేసారు. మా రమేష్ గారు అద్భుతమైన  పబ్లిసిటీ పోస్టర్ డిజైన్ చేసారు. మా చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేసిన పూరి ఆకాష్ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ… “కాకినాడలో నలుగురి స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాను, నిర్మాత రమేష్ గారు ఒక పునాదిగా నిలిచారు. అందరూ కష్టపడి పని చేశాం. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది” అన్నారు. హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ “ఈ కథ వినగానే బాగా నచ్చింది. వెంటనే స్టార్ట్ చేసాం. రఘు గారి సంగీతం మా సినిమాకి ప్రాణం పోసింది. నిర్మాత గారు బాగా సపోర్ట్ చేసారు. ప్రతి టెక్నిషన్ బాగా సపోర్ట్ చేసారు. పూరి ఆకాష్ గారు నా సినిమా ట్రైలర్ విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది”అన్నారు.

సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ… “ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాధ్ గారు. ఇప్పుడు మా బ్యాచ్ సినిమా ట్రైలర్ విడుదల చేయటానికి పూరి గారి అబ్బాయి ఆకాష్ రావటం చాలా సంతోషంగా ఉంది. పెద్ద బ్యానర్ సినిమాలో ప్రయోగం చేద్దాం అంటే రిస్క్ ఎందుకు అనుకుంటారు, కానీ చిన్న సినిమాలో ప్రయోగం చేయటం సులభం. అసిరయ్య బాబాయ్ ట్రైన్ లో పాడుతున్న వీడియో చూసాను. గొప్ప గాయకుడు, ఈ సినిమాతో తనను పరిచయం చేస్తున్నాను. అలాగే నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో పెరిగిన అమ్మాయి లక్ష్మి మా చిత్రంలో ఒక మంచి పాట పాడింది. సాయి సంవిద్ అమ్మాయి గొంతులా పాడతాడు. తనతో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడించాను. ఈ పాటలు మంచి హిట్ అవుతాయి. బాల నటుడిగా సాత్విక్ 80 సినిమాలు చేసాడు. ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. ఈ చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. 

More Related Stories