English   

కార్తీక్ సాయి ది కిల్లర్ ప్రీ రిలీజ్ వేడుక

Kaarthik sai The killer pre release event
2021-08-26 22:28:26

కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, డాలీషా, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా  చిన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం కార్తీక్ స్ ది కిల్లర్.  శ్రీమతి లలిత సమర్పణలో  యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్ & సంకినేని వాసు దేవ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిలుగా తెలంగాణ ప్రొహిబిషన్, అండ్ ఎక్సయిజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జయసుధ తనయుడు నీహాల్  తదితర ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రైలర్ విడుదల చేయగా, బిగ్ టికెట్ ని హీరో సోహెల్ విడుదల చేసారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ... కార్తీక్ సాయి హీరోగా, డాలీషా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కిల్లర్, నిర్మాతలు రాజు గారు, వాసు దేవరావ్ నిర్మాతలుగా తీస్తున్న సినిమా. తెలంగాణ రాకముందు సినిమా రంగంలో కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉండేది, వాళ్ళు తీసింది సినిమాలు, కానీ తెలంగాణ వచ్చాకా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది సినిమా రంగంలోకి వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సినిమా రంగానికి ఎంతో ప్రోత్సహం అందిస్తున్నారు. పరిశ్రమకు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం. కొత్త టాలెంట్ వస్తేనే పరిశ్రమ మనుగడ సాగుతుంది. అయితే.. సినిమాల్లో మంచి మెసేజ్ ఉండే సినిమాలు రావాలి.  కేవలం వినోదం కోసమే కాదు, అందరు అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసేలా మంచి సినిమాలు రావాలి. ఈ సినిమా విషయానికి వస్తే.. కార్తీక్ సాయి చేస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... షూటింగ్స్ కోసం దేశ దేశాలకు పోకుండా తెలంగాణలోనే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. కేవలం నామమాత్రపు ఫీజుతో మీకు కావలసిన అన్ని రకాల లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని సినిమా వాళ్ళు వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇక కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని అలాగే అతను హీరోగా మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చిన్న మాట్లాడుతూ.. కార్తీక్ ది కిల్లర్ ... ఈ సినిమా గురించి సతీష్ ఫోన్ చేసి సార్ ఈ సినిమా మీరు చూడాలి అని అడిగారు. సైకో సినిమా ను పట్టుబట్టి నాకు చూపించారు, అంతే కాదు ఈ సినిమాకు మీరే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాలనీ పట్టుబట్టారు. సినిమా చూసాను .. బాలయ్య సింహా తరువాత ఆ రేంజ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా హీరో, డైరెక్టర్ కార్తీక్ చేయడం నిజంగా సూపర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి. కార్తీక్ కు తప్పకుండా మంచి ఫుచర్ ఉంటుంది అన్నారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ.. కిల్లర్ మూవీ ట్రైలర్ వేరేలా ఉన్నది.. దీని కథ వేరేగా ఉన్నది... ఈ వేదికపై ఒక తండ్రి కళ్ళలో ఆనందం చూసాను. నా కొడుకు ఎదగాలి అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేసారు కదా.. తప్పకుండా మీ కల నెరవేరుతుంది. సెప్టెంబర్ 3న విడుదల అవుతుంది కాబట్టి .. అందరు థియేటర్స్ లో సినిమా చూడండి. నేను సాంగ్స్ చూసాను ఇరగదీసాడు. కార్తీక్ ఈ సినిమా విషయంలో అన్ని బాధ్యతలు తీసుకుని చేశారు. తప్పకుండా మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. కొత్తవాళ్ల చేస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే డాలీషా తో నేను ఓ సినిమా చేశాను. ఇక ఈ వేడుక ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణం అయిన సంతోషం సురేష్ గారికి థాంక్స్ చెప్పాలి.. ఈవెంట్ అదిరిపోయింది అన్న. సో తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో, దర్శకుడు కార్తీక్ సాయి ( చిన్నా ) మాట్లాడుతూ.. నాకు ఈ రోజు ఈ స్టేజి పై నిలబడి మాట్లాడటానికి పదేళ్లు పట్టింది. నన్ను నమ్మింది మా ఫ్యామిలీ. మనం ఏమి చేస్తున్నాం అని అందరు అడుగుతూనే ఉంటారు.. మీ అబ్బాయి ఏమి చేస్తున్నారు అని.. కానీ మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ పదేళ్లు నేను ఫ్యామిలీ ని మిస్ అయ్యాను. ఇంట్లో భోజనం చేసి ఆరు నెలలైంది. ఫ్యామిలీ ని మిస్ అయింది కేవలం ఈ రోజు కోసం .. నన్ను ఎంకరేజ్ చేసింది మా అమ్మ, నాన్న ఆ తరువాత వాసుగారు .. సొంతోళ్లు ,కూడా నమ్మరు కానీ అయన నన్ను నమ్మరు. సినిమా చాలా బాగా వచ్చింది. కిల్లర్ అంటే ఎదో థ్రిల్లర్ అనుకోకండి... ఇది ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా. తప్పకుండా అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి.

ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ఎడిటర్, కెమెరా మెన్, అలాగే సతీష్ గారు అలాగే నా టీం అందరు, వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది .. అలాగే ప్రియా నన్ను అమ్మలా చూసుకుంది. కార్తీక్ సాయి ఇంకా మూడు సినిమాలు చేస్తున్నాడు .. ఆ మూడు సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి .. ఈ సినిమా ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను, ఈ సినిమాకు చిన్నాగారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు .. సినిమాలో చాలా మంది కొత్తవాళ్లు నటించారు. ఇది నా పదేళ్ల కష్టం .. ఇది గుర్తిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. తగ్గేదేలే ! ఈ సినిమా విడుదల రోజు మార్నింగ్ షో అన్ని సెంటర్స్ లో ఫ్రీ .. సినిమా చూడండి పదిమందికి చెప్పండి, అలాగే ఈ వేడుక ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి గారికి థాంక్స్  అన్నారు. 

More Related Stories