English   

నా పాత్ర ని చూసిన కృష్ణ గారు నాకు ఫోన్ చేయటం నా కళ్ల లో కన్నీళ్లు తెప్పించాయి -సీనియర్ యాక్టర్ నరేష్

krishna lauds naresh
2021-08-31 23:11:34

సుధీర్ బాబు, ఆనంది జంటగా 70 mm ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమా విడుదల అయిన రోజు నుంచి మంచి ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రి పాత్ర పోసించిన సీనియర్ యాక్టర్ నరేష్ మీడియాతో చెప్పిన  ఆ సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే.. ఈ మూవీ మంచి విజయం సాధించినందుకు చాలా సంతోషం గా వుంది, చాలా సినిమాలలో తండ్రి పాత్రలు పోసించినప్పటికీ ఈ మూవీలో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండి నాకు చాలా మంచి పేరు తెచ్చింది.

కృష్ణ గారు ఈ మూవీ చూసి నాకు ఫోన్ చేశారు. నీ పాత్ర నాకు చూసినంతసేపు నాకు కళ్ళలో కన్నీరు తెప్పించింది, నువ్వు సుదీర్ బాబు ఈ మూవీలో ఎక్కువ భాగం సినిమా సక్సెస్ కు తోడ్పడ్డారు, ఆరోజు కృష్ణ గారితో పాటు మంజుల, సుదీర్ బాబు భార్య, జయ దేవ్ భార్య పద్మ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉండి అందరు ఫోన్ లో మాట్లాడారు. అందరు నాతో చాలా బాగా చేసారు అని చెప్పగానే నాకు చాలా సంతోషం గా అనిపించింది. సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ చూసి ట్విట్ చేయటం చాలా మంచి పరిణామం, మహేష్ సినిమా బాగోకపొతే అసలు ట్విట్ చేయడు అంత పెద్ద హీరో సినిమా బావుంది అని చెప్పటం శుభ పరిణామం.

మా సుదీర్ బాబు గురించి చెప్పాలంటే... ఈ జనరేషన్ లో చాలా కష్టపడే హీరో, క్లైమాక్స్ లో సుదీర్ నా మొహం మీద ఉమ్ము ఊసే సీనులో చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు నువ్వు ఉమ్ము ఊసేది నా క్యారెక్టర్ మీద అని చెప్పను. అయినా కానీ సుదీర్ నా వల్ల కాదు అన్నాడు అప్పుడు సైడ్ కి పెట్టి చేయించాం సుధీర్ కి ఈ మూవీ నటుడి గా ఒక మెట్టు పెంచుతుంది. హీరోయిన్ నందిని క్యారెక్టర్ చాలా మంది మహిళలకు కనెక్ట్ అయ్యింది, ఒక తండ్రి కూతురు కన్నా కులం గొప్పది అనే అపోహలో వున్న తండ్రి కి ఈ జనరేషన్ లో వున్న అమ్మాయి గా అందరకి బాగా చేరువయింది.

ఈ మూవీ డైరెక్టర్ కరుణ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. కరుణ పలాస కమర్షియల్ గా హిట్ కాకపోయినా మంచి ప్రజాదరణ పొందింది, కరుణ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. మంచి భవిష్యత్తు వుంది. ఈ మూవీ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు. ఈ మూవీ పాటలు సినిమా రిలీజ్ కి ముందే చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పనవసరం లేదు అందులో మణిశర్మ గారు సిద్దహస్తుడు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ 70mm బ్యానర్ విజయ్ చిల్ల,శశి దేవి రెడ్డి మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. డి. రామానాయుడు గారు తరువాత అంత మంచి అభిరుచి వున్న ప్రొడ్యూసర్స్, ఆయన అంత స్థాయి కి 70mm వాళ్ళు చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను.  ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలి అంటే.. టక్ జగదీశ్ లో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నితిన్ మాస్ట్రో రిలీజ్ కి సిద్ధంగా వుంది, అశోక్ గల్లా తో ఓ సినిమా చేస్తున్నాను, ఇంకా కొన్ని ఫైనల్ స్టేజ్ లో వున్నాయి. 

More Related Stories