English   

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల మూవీ ప్రచార చిత్రం విడుదల

pawan harish shankar movie poster released
2021-09-03 22:00:54

పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ ప్రచార చిత్రాన్ని గమనిస్తే…. ఆధునిక వాహనం పై పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అయితే.. పవన్ కల్యాణ్ ను పూర్తిగా చూపించకుండా ఉండటాన్ని ప్రీ లుక్ గా భావించాలని చిత్ర బృందం చేసిన ప్రయత్నం హర్షించదగ్గది. అయినా ప్రచార చిత్రం యువతను కిర్రెక్కిస్తోంది. అభిమాన యువతలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం ‘జాతర షురూ’ అన్న ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడుగా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్ పేర్లు ప్రధాన సాంకేతిక నిపుణులుగా ఈ ప్రచారచిత్రంలో కనిపించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు నిర్మాతలు. 
 

More Related Stories