English   

బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ.

Film with Bandla Ganesh as the hero kickstarts shooting.
2021-09-04 21:51:54

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకం పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ... "తమిళ హిట్ 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. 

ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్. సినిమా కూడా సర్ ఫ్రైజింగ్ గా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, నిర్మాణం: స్వాతి చంద్ర, దర్శకత్వం: వెంకట్ చంద్ర. 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

More Related Stories