English   

మెగాస్టార్ కోసం పవన్ తగ్గుతాడా..  సినిమాతో గొడవలు మొదలవుతాయా?

acharya and bheemla nayak
2021-09-06 18:20:19

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ  ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న భీమ్లా నాయక్ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాడు. అందుకోసం కావాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆచార్య సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేస్తాడా లేక వెనక్కి తగ్గుతారా అనేది తెలియాల్సి ఉంది. 

ఇప్పటి వరకూ అన్నదమ్ముల మధ్య మంచి రిలేషన్ ఉన్నా ఈ సినిమాతో వీరిద్దరి మధ్య దూరం పెరగనుందా? ఈ సినిమాలు రిలీజ్ విషయంలో వీరిద్దరి మధ్య గ్యాప్ వస్తుందా అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమాలా రిలీజ్ లు ఎలాంటి మార్పును తీసుకొస్తాయో చూడాలి. 

More Related Stories