English   

మరీ ఇంత అమాయకంగా ఉంటే తొక్కేస్తారు షణ్ముఖ్..

shanmukh jaswanth
2021-09-08 08:48:38

షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూ ట్యూబ్ ఫాలో అయ్యే వాళ్లకు ఇతను ఒక సూపర్ స్టార్. 4 మిలియన్ల ఫాలోవర్స్ తో ది బెస్ట్ యూట్యూబ్ గా అవార్డు కూడా అందుకున్నాడు షణ్ముఖ్. ఏడాదిన్నర కింది వరకు ఈయన కూడా మామూలు కవర్ సాంగ్స్, కామెడీ వీడియోలు చేసుకునే వాడు. కానీ గతేడాది ఈయన నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సూర్య కూడా సంచలనం సృష్టించింది. ఒక్కో వీడియో యూ ట్యూబ్ లో 10 మిలియన్లకు మించి వ్యూస్ అందుకుంది. అంతటి ఫాలోయింగ్ వచ్చిన తర్వాత కూడా చాలా సైలెంట్ గా కనిపిస్తాడు షణ్ముఖ్.

 

కెమెరా ముందు ఎంతో జోష్ గా కనిపించే ఈ కుర్రాడు.. బయట మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు. అలాంటి షన్ను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. ఇంటర్వ్యూలకు రమ్మంటేనే 100 సార్లు ఆలోచించే కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఏం చేస్తాడు అంటూ చాలా మంది ముందు నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కు ఇవ్వనంత ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి షణ్ముఖ్ జస్వంత్ ను బిగ్ బాస్ హౌస్ కి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత షణ్ముక్ ఉన్న తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు.
మిగిలిన 18 మంది ఒకరికొకరు మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతుంటే.. ఈయన మాత్రం తన దారి తనదే అన్నట్టు ఒక్కడు కూర్చున్నాడు.. ఎవరితోనూ పెద్దగా కలవడం లేదు..

 

మొహమాటంతో కనిపిస్తున్నాడు.. ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ పై కామెంట్స్ మొదలయ్యాయి. అది నీ ఇల్లు కాదు షన్ను.. అక్కడ నువ్వు అంత అమాయకంగా ఉంటే తొక్కేస్తారు.. మొహమాటంతో ఉంటే ఇంటికి పంపిస్తారు.. నీ ఆట నువ్వు ఆడు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి షణ్ముఖ్ యూ ట్యూబ్ వీడియోల్లో చూడడం మినహాయిస్తే బయట ఇంటర్వ్యూలలో పెద్దగా కనిపించడు. ఒకవేళ వచ్చినా కూడా సైలెంట్ గా కూర్చుంటాడు. ఈ మొహమాటం పోయి తనను తాను కొత్తగా ఆవిష్కరించడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు చెప్పాడు ఈ కుర్రాడు. మరి చెప్పింది చేసి చూపిస్తాడో చూడాలి.

More Related Stories