English   

తెలుగు, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న "స్ట్రీట్ లైట్"

Street light ready for release
2021-09-09 21:36:24

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల మూడవ వారంలో చిత్రం విడుదల సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా జరుపుకుంది.

ఈ సందర్భంగా నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నేను చేసిన మొదటి చిత్రం మౌన పోరాటంలో నేనే హీరో,నేనే విలన్. ఇన్ని రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు అటువంటి మంచి షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాతో లభించింది. స్ట్రీట్ లైట్ సినిమా చాలా హాట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నిఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి. వారు ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా ఒకే ప్లేస్ లో ఒకే స్ట్రీట్ లైట్ కింద ఏం జరిగింది అనేది దర్శకుడు చాలా చక్కగా తీశాడు. గత 35 సంవత్సరాలుగా నేను మౌన పోరాటం నుండీ ఇప్పటివరకూ నేను 150 సినిమాలలో నటించడం జరిగింది. మళ్లీ ఇప్పుడు బుల్లెట్ సత్యం సినిమాతో మళ్లీ సినిమాలు చేస్తున్నాను. చాలా రోజుల తరువాత నేను చేస్తున్న మంచి సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాలో నటించే ఆ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తెలుగు, హిందీ రెండు భాషల్లో విడుదల చేస్తున్నాం హిందీలో స్ట్రెయిట్ సినిమాగా సెన్సార్ వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమా చూసి ఇది చాలా గ్లామర్  సినిమా అని మెచ్చుకొని ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ ఇచ్చారు. ఇది మా సక్సెస్ కు మొదటి మెట్టు.. ఈ సినిమా స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు కానీ.. ఈ సినిమాలో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని అన్నారు.

చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. నిర్మాతకు స్ట్రీట్ లైట్ కాన్సెప్ట్ చెప్పినపుడు మేమంతా స్ట్రీట్ లైట్ కింద ఉన్న చిన్న ప్లేస్ లో 2 గంటల సినిమాను కాంపాక్ట్ గా ఎలా తీయాలి అని డిస్కషన్ చేసుకుని స్టార్ట్ చేశాం. ఆ స్ట్రీట్ లైట్ కు రెండు కళ్ళు వినోద్ కుమార్, తాన్యా దేశాయ్. అయితే...ఆ కళ్ళ ను తెరిపించిన వారు డిఒపీ రవికుమార్ గారు. ఈ కళ్ళు మరియు సినిమా అంతటినీ మ్యానేజ్ చేసి ఒకే ఒక వ్యక్తి మామిడాల శ్రీనివాస్ గారు. వీరందరి సహాయంతో రెండు గంటల సినిమాను 100 మీటర్ల  స్థలంలో తీయగలిగి సక్సెస్ చేయడంలో భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా స్ట్రీట్ లైట్ సినిమాను మీరందరూ ఆదరించాలి. ముందు ఈ సినిమాను ఓటిటికు విడుదల చేయాలి అనుకున్నాం కానీ థియేటర్స్ బాగుండాలనే ఉద్దేశ్యంతో థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం అన్నారు.

More Related Stories