English   

గోపీచంద్ సీటీ కొట్టి.. సీటీమార్‌తో హిట్ కొడ‌తాడు - బోయపాటి శ్రీను.

Seetimaar pre release event
2021-09-10 04:41:22

హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేస్తున్నారు. ఈ సందర్భంగా సిటీ మార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ ఫంక్షన్ లో ఎగ్రెసివ్ స్టార్‌ గోపీచంద్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ట్రైలర్ చూసి యూనిట్‌కు విషెష్ చెప్పిన మెగాస్టార్ గారికి థాంక్స్‌. అలాగే నా స్నేహితుడు ప్ర‌భాస్ కూడా ట్రైల‌ర్ చూసి స్పెష‌ల్‌గా ఫోన్ చేసి మాట్లాడాడు. త‌న‌కు కూడా థాంక్స్‌. సినిమా విష‌యానికి వ‌స్తే.. 2019 డిసెంబ‌ర్‌లో సీటీమార్‌ను షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. యాబై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత కోవిడ్ ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ పెట్టారు. దాదాపు తొమ్మిది నెల‌లు షూటింగ్‌ను ఆపేశాం. త‌ర్వాత న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి పూర్తి చేశాం, రిలీజ్‌కు చేద్దాం అనుకుంటున్న త‌రుణంలో మ‌రోసారి కోవిడ్ ఎఫెక్ట్‌తో సినిమా ఆగింది. ఆ స‌మ‌యంలో నిర్మాత‌లను చూసి బాధేసింది. నా నిర్మాత‌ల‌నే కాదు, ఏ నిర్మాత అయినా ఎంతో క‌ష్ట‌ప‌డి, డ‌బ్బులు పెట్టి సినిమా తీస్తాడు. ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ సినిమాపైనే ఆధార‌ప‌డి ఉంటారు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే చాలా ఇబ్బందే. గ‌త నెల‌న్న‌ర‌గా ప‌రిస్థితులు బెట‌ర్ అవుతున్నాయి. అంద‌రూ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు సీటీమార్ వంటి ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా వ‌స్తుంది. ప్రేక్ష‌కుల‌ను ఇంటి నుంచి థియేట‌ర్స్‌కు తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా అనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాను ఆద‌రిస్తే, మిమ్మ‌ల్ని అల‌రించ‌డానికి చాలా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి.

మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అండ్ టీమ్ ఎక్కువ బ‌డ్జెట్ అవుతుంద‌ని నేను చెబితే, క‌థ న‌చ్చిందండి చెప్పి సినిమా స్టార్ట్ చేశారు. ఆరోజు నుంచి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను చాలా గొప్ప‌గా తెర‌కెక్కించిన నిర్మాత‌లు శ్రీను గారు, ప‌వ‌న్‌ గారికి థాంక్స్‌. సంప‌త్ నందితో గౌత‌మ్ నంద సినిమా చేశారు. ఇది రెండో సినిమా. సంప‌త్ హండ్రెడ్ ప‌ర్సెంట్ మ‌న‌సు పెట్టి ఈ సినిమా చేశాడు. డెఫ‌నెట్‌గా మేం ఏద‌యితే అనుకున్నామో దాన్ని రీచ్ అవుతామ‌ని అనుకుంటున్నాం. ఇంత మంచి సినిమా చేసిన సంప‌త్‌కు థాంక్స్‌. సినిమాటోగ్రాఫ‌ర్ సౌంద‌ర్‌.. బ్యాక్‌బోన్‌లా నిలిచాడు. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన సాంగ్స్ ఇప్ప‌టికే హిట్. ఇక ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ అందించ‌డంలో కింగ్‌. ఆయ‌న‌కు థాంక్స్‌. త‌మ‌న్నాకు, నాతో క‌లిసి న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. ఇది థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా.. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమా చూడండి. ఎంజాయ్ చేసి ఇంటికెళ‌తారు. అందులో డౌట్ లేదు’’ అన్నారు.

డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ... ‘‘మా గోపీ గారు సహా నిర్మాతలు, ఇత‌ర ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ గురించి ఫ్యూచ‌ర్‌లో మాట్లాడుతాను. సినిమా పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మ‌న‌కు స్వాతంత్య్రం రాక ముందే మ‌న జీవితాల్లోకి సినిమా వ‌చ్చింది. మూకీగా, టాకీ మొద‌లైన సినిమా త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌.. క‌ల‌ర్ సినిమాగా మారింది. నేల టిక్కెట్టు నుంచి బ్లాక్ టిక్కెట్టు వ‌ర‌కు సినిమా మారింది. చైనా త‌ర్వాత ఎక్కువ థియేట‌ర్స్ ఉన్న దేశ‌మేదంటే మ‌న‌దే. మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే 2800 నుంచి 3000 వ‌ర‌కు థియేట‌ర్స్ ఉన్నాయి. మ‌న దేశంలో క్రికెట్ త‌ర్వాత ప్రేక్ష‌కులు కోరుకునే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఏదైనా ఉందంటే అది సినిమానే. అలాంటి సినిమా మ‌న‌కు ఫ్రైడే పండ‌గ‌ను తీసుకొస్తుంది. సండే వ‌చ్చిందంటే మ‌న‌కు స‌ర‌దాకి సినిమా కెళ్లాలి. అన్నీ మ‌తాల‌వాళ్లు వెళ్లే ఒకే ఒక గుడి థియేట‌ర్. మ‌న ద‌ర్గా అదే.. మ‌న దుర్గ‌మ్మ గుడి అదే.. మ‌న మెద‌క్ చ‌ర్చి అదే. అలాంటి థియేట‌ర్ ఈరోజు క‌ష్టాల్లో ఉంది. ఏడాదిన్న‌ర‌గా మ‌న‌కు పాలాభిషేకాలు లేవు, క‌టౌట్స్ లేవు, పేప‌ర్స్ చించుకోవడాలు లేవు, టిక్కెట్స్ కోసం క్యూ నిలుచుని కొట్టుకోవ‌డాలు లేవు.

మ‌ళ్లీ సినిమాలు థియేట‌ర్స్‌లో విజృంభించాలి. అది ఖచ్చితంగా జ‌రుగుతుంది. ఈ విష‌యాన్ని న‌మ్మే మా నిర్మాత‌లు శ్రీనుగారు, ప‌వ‌న్‌గారు ఎన్ని ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చినా మా సీటీమార్‌ను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని ఐదు నెల‌లుగా ప్రాణాలు ఉగ్గ‌బ‌ట్టుకున్న‌ట్లు సినిమాను ఉగ్గ‌బ‌ట్టుకుని వెయిట్ చేశారు. సెప్టెంబ‌ర్ 10న ఈ సినిమా మ‌న ముందుకు వ‌స్తుంది. మ‌న‌కు, మ‌న సినిమా ఇండ‌స్ట్రీ వ‌చ్చిన విఘ్నాల‌న్నీ తొలిగి అంద‌రికీ శుభం జ‌ర‌గాల‌ని, జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాం. ఈ సినిమాను చూస్తే మ‌మ్మ‌ల్నే కాదు, ఎంటైర్ సినిమా ఇండ‌స్ట్రీనే ఆశీర్వ‌దించిన‌ట్లే. త‌ప్ప‌కుండా మీ అంచనాల‌ను అందుకునే సినిమా చేశాం. త‌ప్ప‌కుండా అంద‌రూ మెచ్చుకునే సినిమా చేశాన‌ని అనుకుంటున్నాను. ఇది దంగ‌ల్‌, చ‌క్ దే ఇండియా త‌ర‌హాలో సీటీమార్‌ కేవ‌లం స్పోర్ట్స్ సినిమా కాదు.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న మాస్ క‌మ‌ర్షియ‌ల్‌ మూవీ. సేవ్ సినిమా’’ అన్నారు.

బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ... ‘‘‘సీటీమార్’ సినిమా గ్యారంటీ హిట్‌. చిట్టూరి శ్రీను, నేను ఒకేసారి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాం. ఒకేసారి వ‌చ్చాం, ఒకే సినిమాతో మొద‌లయ్యాం. చిట్టూరి శ్రీను ఒక్కొక్క క్రాఫ్ట్‌లో ప‌నిచేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వ‌చ్చి యూ ట‌ర్న్ వంటి మంచి సినిమాతో నిర్మాత‌గా మారారు. వెంట‌నే నిర్మాత‌గా తొంద‌ర ప‌డ‌కుండా సీటీమార్ అనే మ‌రో మంచి సినిమాతో మ‌న ముందుకు రాబోతున్నారు. టైటిల్ వింటుంటేనే మ‌ణిశ‌ర్మ‌గారిని గుర్తుకు తెచ్చుకోవాలి. సౌండ్ వింటుంటే లోలోప‌ల స్టెప్ వేసుకునేలా ఉంది. శ్రీను ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గానే, లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేనితో మ‌రో సినిమాను స్టార్ట్ చేశాడు. ఆయ‌న అలాగే ముందుకు రావాలి. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ఇండ‌స్ట్రీ బావుంటే అంద‌రం బాగుంటారు. రీసెంట్‌గా జ‌రిగిన ఒలింపిక్స్‌లో సింధు ద‌గ్గ‌ర నుంచి చాలా మంది అమ్మాయిలు మ‌న దేశం పేరు నిల‌బెట్టారు.

అమ్మాయిలు ఎందులో త‌క్కువ కాదు... అధికులు కూడా. వాళ్లు సాధిస్తారు కూడా. అలాంటి అమ్మాయిల‌పై స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేసిన శ్రీనుని, డైరెక్ట‌ర్ సంప‌త్‌ని, హీరో గోపీచంద్‌ను అభినందించాలి. గోపీచంద్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఫైట‌రే. ఎందుకంటే.. ఆయ‌న టి.కృష్ణ అనే మ‌హానుభావుడి కొడుకు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసే స‌త్తా ఉన్న కూడా, నాకు సామాజిక స్పృహ ఉంది. సోసైటీపై నాకొక బాధ్య‌త ఉంది. ప్ర‌జ‌ల‌ను నిద్ర లేపాల్సిన అవ‌స‌రం ఉంది. అనే సిద్ధాంతాన్ని విడిచి పెట్ట‌కుండా దాన్ని ఫాలో అవుతూ, సినిమాలు చేశారు. అంత గొప్ప మ‌నిషి కొడుకే మ‌న గోపీచంద్‌. అంతా ఉన్నా కూడా గోపీచంద్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచి అన్నీ ఒడిదొడుకులే. కానీ గోపీచంద్‌కి మ‌ళ్లీ లేస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. కాబ‌ట్టి ఎక్క‌డా డిసప్పాయింట్ కాకుండా ముందుకు క‌దిలాడు. గోపీచంద్ హీరోలా, విల‌న్‌గా చేసి ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్నాడు. సీటీ కొట్టి.. సీటీమార్‌తో హిట్ కొడ‌తాడు. సినిమా స‌క్సెస్ కావాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
 

More Related Stories