English   

నాగచైతన్య లవ్ స్టోరీ వచ్చేది ఎప్పుడు.?

Nagachaitanya Love story update
2021-09-09 22:54:51

అక్కినేని నాగచైతన్య - ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ఈ మూవీ సాంగ్స్ అండ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ వలన ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అదే రోజున నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ అవుతుండడం వలన లవ్ స్టోరీ వాయిదా పడింది. 

అయితే.. అక్టోబర్ 1 నుంచి మిడియం సినిమాలు బజ్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, వైష్ణవ్ తేజ్ కొండపొలం, శర్వానంద్ మహా సముద్రదం.. ఇలా చాలా సినిమాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. దీంతో అసలు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందా..? అవ్వదా..? అభిమానులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఈ సినిమా నిర్మాతలు ఈ లవ్ స్టోరీని ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయం పై బాగా టెన్షన్ ఫీలవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

సెప్టెంబర్ నెలాఖరులోపు లవ్ స్టోరీ రిలీజ్ చేయాలి. ఒకవేళ రిలీజ్ చేయడం కుదరకపోతే.. అక్టోబర్ నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి కాబట్టి పోటీ ఉంటుంది. అలాగే థియేటర్లు దొరకడం కూడా కష్టం కావచ్చు. అందుచేత లవ్ స్టోరీ రిలీజ్ విషయంలో ఆలోచనలో పడ్డారట. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ నెలాఖరున లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో లవ్ స్టోరీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి... త్వరలోనే లవ్ స్టోరీ రిలీజ్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

More Related Stories