దాదా బయోపిక్ : ఆ విషయం తెలియగానే థ్రీలయ్యాను!

టీమిండియా క్రికెట్ చరిత్రలో ఒక్కొ ఆటగానిది ఒక్కో ప్రత్యేకత. క్రికెట్ గాడ్ గా సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ గా ధోనీ పేరుగావించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న క్రికెటర్ బెంగాల్ టైగర్, టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. అద్భుత ప్లేయర్‌గానే కాగా.. ఎంతోమంది క్రీడాకారులకు స్పూర్తిదాయక ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
మైదానంలో ఉన్నంత సేపు సౌరవ్ గంగూలీ. ఆటగాడిగా, కెప్టెన్ గా ఎంతో దూకుడుగా వ్యవహరించేవాడు. కాగా, సౌరవ్ జీవితకథ ఆధారంగా ఇప్పుడూ ఓ బయోపిక్ రానున్నది. ఈ బయోపిక్ లవ్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కనున్నది. ఈ చిత్రాన్ని లవ్ రంజన్, అంకుర్ గార్గ్ లు నిర్మించనున్నారు.
"క్రికెట్ నా జీవితం, అది నాకు జీవితంపై నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. నా క్రికెట్ జర్నీ ఎంతో ఉత్సాహాంగా సాగింది... నా లైఫ్ జర్నీపై బయోపిక్ రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. " అంటూ సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు .
ఈ చిత్రం ద్వారా గంగూలీ క్రికెట్ జీవితమే కాదు, తన వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను కూడా తెలుసుకునే అవకాశముంది. ప్రేమ, పెళ్లి తన కెరీర్ లోని తదితర ముఖ్య ఘట్టాలు నేపథ్యంతో బయోపిక్ తెరకెక్కనున్నది. ఈ చిత్రం కోసం అటు చిత్ర సీమతో పాటు, క్రీడా లోకం కూడా ఎంతో ఆసక్తిగా వేచిచూస్తుంది. అయితే గంగూలీ పాత్రను ఎవరు పోషించబోతున్నారనేది తెలియాల్సి ఉంది.