ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా? మీ కోసం చిన్నక్లూ.. తెలుగు టాప్ హీరోయిన్లో ఒకరు.

ఈ మధ్యకాలం సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువైంది. సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు ఇంటర్ నెట్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న విషమైన తెగ వైరల్ అవుతుంది. అది ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన విషయమైతే.. చెప్పవల్సిన అవసరం లేదు.. గంటల్లో నెటింట్లో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో స్టార్స్ కుడా తమ అభిమానులతో కలిసి ముచ్చడించడానికి ఆసక్తి చూపుతున్నారు. తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలువురు స్టార్స్ త్రోబ్యాక్ ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా ఓ చిన్నారి ఫోటో ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. చూస్తున్నారుగా.. ఈ ఫోటోలో వ్యక్తిని గుర్తుపట్టారా? లేదా? అయితే..మీకోసం చిన్నక్లూ.. ఆ పాప ఇప్పుడు టాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్. ఇటీవల సూపర్ హిట్ సినిమాతో నటించి మెప్పించిన హీరోయిన్. మన తెలుగింటి అమ్మాయిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇంకో చెప్పాలా? మన విక్టరీ వెంకీ సరసన కూడా నటించింది .. అయ్యో ఇక గుర్తు పట్టాలేదా! అయితే మేమే చెప్పాం లేండీ!
ఆ చిన్ననాటి ఫోటో ఏవరిదో కాదండి.. మన సీతది. అదేనండీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు హీరోయిన్ అంజలి. తన అందం, అభినయంతో నటించి మెప్పించిన హీరోయిన్. తన నటనతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకుంది.