రిపోర్టర్ నుంచి హీరోగా.. బిగ్ బాస్ కంటెస్టెంట్ వీజే సన్నీ రియల్ సోర్టీ!

బిగ్‌బాస్ తెలుగు 5 లో రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటుడు వీజే సన్నీ. సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ 1989 లో ఖమ్మంలో జన్మించారు.అతని స్కూలింగ్ ఖమ్మంలో, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి తల్లి ప్రొత్సాహంతో నటనపై ఆసక్తి పెంచుకున్నారు. స్కూలింగ్ సమయంలో తాను వేసిన ‘అల్లాదీన్’ నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ ప్రోత్సహంతో నటనపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షోతో బుల్లితెరపై కనిపించారు. అదే సమయంలో ఓ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత ఆయన వీజేగా మారిపోయారు. తన కెరీర్లో ఆయన ఎంతో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.
ఈ తరుణంలోనే ‘కళ్యాణ వైభోగం’ అనే టీవీ సీరియల్ లో జయసూర్య అనే లీడ్ రోల్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ సీరియల్ ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల మదిలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. మరోవైపు సినిమాల్లో నటించే కూడా రెడీ అయ్యారు. త్వరలో ‘సకలగుణాభి రామా’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈ మధ్యే విడుదల అయింది. మరో విశేషమేమిటంటే.. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్లో ఆయనకు మూడుసార్లు చోటు దక్కింది. మరి బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఏ మేరుకు అలరిస్తాడో చూడాలి మరి.