Bigg boss 5: బుల్లి తెర యాంకర్ రవి అసలు స్టోరీ..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తొలుత డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ఆరంభించిన రవి.. అనంతరం యాంకరింగ్ వైపు దృష్టి సారించారు. తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూ.. అనతికాలంలోనే బుల్లితెరపై మేటి యాంకర్‌గా స్థానం సంపాదించుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై రకరకాల ప్రోగ్రామ్‌లు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో చేరుగని ముద్ర వేసుకున్నారు. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే తర్వాత రవి తన కెరీర్లో వచ్చిన అనేక ఒడిదుడుకులు వచ్చినా.. తట్టుకోని ఎదురునిలిచారు. యాంకర్‌గా రాణిస్తూ కోట్లాదిమందిని ఎంటర్టైన్ చేస్తున్నాడు.
అలాగే.. ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. కానీ చిత్రం బెడిసి కొట్టడంతో సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం వన్ షో, ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిరాక్ వంటి ప్రముఖ షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. ఇతడికి భార్య నిత్య సక్సేనా, కూతురు వియా ఉంది. ఈ షోలో పాల్గొనడానికి రవికి వారానికి సూమారు రూ. 3 నుంచి రూ. 5 లక్షలు అందించనున్నట్టు తెలుస్తుంది. ఇంత భారీగా రెమ్యూనేషన్ తీసుకుంటున్న రవి బిగ్‌బాస్ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటాడో చూడాలి.