English   

 జెస్సీ మామూలోడు కాదు..! మోడలింగ్ లో యూత్ ఐకాన్‌

jaswanth padala
2021-09-11 11:36:06

జ‌స్వంత్ ప‌డాల (జెస్సీ) ..ఈ పేరు అందరికీ కొత్త‌నే.. కానీ చిన్న‌వయసులోనే త‌న కెరీర్ లో ఉన్న‌త స్థాయికి చేరుకున్న ఫ్యాష‌న్ డిజైన‌ర్, మోడ‌ల్, ర్యాంప్ వాక‌ర్ జ‌స్వంత్ ప‌డాల‌. ఆయ‌న ర్యాంప్ వాకింగ్ లో ట్రైనింగ్ కూడా ఇస్తాడంట‌. చూడ్డానికి బాలీవుడ్ హీరోలా క‌నిపించిన ఇత‌డు తెలుగింటి అబ్బాయే. ఇతగాడు పుట్టింది విజ‌య‌వాడ‌లో ..  పెరిగింది హైదరాబాద్‌లోనే.  
 
మోడలింగ్.. ఫ్యాషన్.. యాక్టింగ్‌పై మక్కువ మోడలింగ్‌లో ట్రైనింగ్ చేశాడు. అనంత‌రం బెంగుళూరులో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొని ..  అవార్డులను సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్‌గా ఎంపిక అయ్యాడు. మోడల్ హంగ్ సీజన్ 2  పాల్గొని విజేతగా నిలిచాడు. అంతేకాకుండా 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్‌ని గెలుచుకోని త‌న స‌త్తా చాటారు. ఇతన్ని ఫ్యాషన్ రంగంలో ‘మిలింద్ సోమన్ ఆఫ్ హైదరాబాద్’ అని కూడా పిలుస్తుంటారు.

సూపర్ మోడల్ ఇండియా, బ్లెండర్ స్ప్రైడ్ మిస్టర్ ఫ్యాషనబుల్ ఐకాన్, ఐఎఫ్ఎల్ మోడల్ ఆఫ్ ఇయర్ 2021 ఇలా చాలా టైటిల్ అత‌ని సొంతం. మోడలింగ్ లో ఈ బెజ‌వాడ అబ్బాయి.. బిగ్ బాస్ లో ఎంత‌వ‌ర‌కు అల‌రిస్తాడో వేచి చూడాలి.

More Related Stories