English   

అత‌డు నుంచి ఆమెగా ! ప్రియాంక సింగ్ హ‌ర్ట్ ట‌చింగ్ స్టోరీ..    

ప్రియాంక సింగ్
2021-09-11 11:43:37

బిగ్ బాస్ షోలో తొమ్మిదో కంటెస్టెంట్‌గా జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్‌, ట్రాన్స్ జెండ‌ర్ ప్రియాంక సింగ్ అలియాస్ సాయి తేజ హౌలో అడుగుపెట్టారు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్ క‌నిపించి న‌వ్వుల పూయించాడు. త‌న చీరకట్టు, బొట్టు, అంద‌చందం తో ఎంత‌మంది మదిని దోచుకున్నాడు. అత‌డు నుంచి ఆమెగా మారాడానికి వెనుక ఈ అందమైన ముద్దుగమ్మ జీవితంలో ఊహించ‌ని విషాదం ఉంది. 

ప్రియాంక సింగ్ జీవితంలోకి వెళితే.. శ్రీకాకుళం జ‌న్మించిన సాయితేజ‌కు చిన్నతనం నుంచే అమ్మాయిలా కోరికలు ఉండేవి. ఇంట‌ర్ వ‌ర‌కు ఆ కోరికను అదుపులోపెట్టుకొన్నాడు. ఈ స‌మ‌యంలోనే త‌న తండ్రి అనారోగ్యం పాలుకావ‌డం. కంటి చూపును కొల్పోడు. దీంతో కొన్ని చిన్న చితిక ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గ‌డిపాడు. కానీ ఓ రోజు రాత్రి ఇంటి నుంచి హైద‌రాబాద్ కు పారిపోయి వ‌చ్చాడు.

అనంత‌రం  సర్జరీ చేయించుకొని ట్రాన్స్‌జెండర్‌గా మారారు. ఆ త‌ర్వ‌త అనేక ప్ర‌య‌త్నాలు చేసి జబర్దస్త్ షోలో స్థానం సంపాదించుకొన్నాడు. త‌న ప్ర‌తిభ ప్రేక్ష‌కుల‌ను మొప్పించి మంచి గుర్తింపు పొందాడు. అయితే అత‌డు  ట్రాన్స్ జెండర్ మ‌రినా విష‌యం త‌న తండ్రికి తెలియ‌క‌పోవ‌డం కొస మొరుపు. 'నా కోరిక కొద్దీ నేనొక అమ్మాయిగా మారినా, నీకు ఎప్పటికీ కొడుకునే, అమ్మానాన్న ఇద్దరూ తల దించుకునే పని ఎప్పుడూ చేయను' అని  స్టేజీ మీద ఎమోషనల్ అయ్యాడు సాయితేజ అలియాస్ ప్రియాంక‌.

More Related Stories