English   

మెగా హీరో రోడ్డు ప్ర‌మాదానికి కార‌మదేనా! అస‌లేం జ‌రిగింది..

sai
2021-09-11 12:29:55

యువ న‌టుడు, మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో  తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్‌ బైక్ పై అతివేగంగా ప్ర‌యాణించ‌డ‌మే కార‌ణ‌మ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తెలింది.  ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు శ‌నివారం ఉద‌యం విడుదల చేశారు. ఆయ‌న హెల్త్  నిల‌క‌డ‌గానే ఉంద‌ని వెల్ల‌డించారు. మ‌రో 24 గంట‌లు క్లోజ్ అబ్జర్వేషన్ ఉంచ‌మ‌ని, ప్ర‌స్తుతం ఐసీయూలో చిక్సిత పొందుతున్నార‌ని తెలిపారు వైద్యులు. ఈ రోజు మ‌రికొన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించల్సి ఉంద‌నీ, రేపు మరొకసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. 

మ‌రోవైపు మెగా ఫ్యామిలీ హీరోలు, అభిమానులు అపోలోకు క్యూ కడుతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి, సురేఖ, నాగబాబు, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌, రామ్‌చరణ్‌, ఉపాసన, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, రాశీకన్నాతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు అపోలో కు చేరుకుని సాయిధ‌ర‌మ్ తేజ ఆరోగ్యం గుర్చి అడిగి తెలుసుకున్నారు. సోష‌ల్ మీడియాలో  సాయిధ‌ర‌మ్ తేజ అభిమానులు త‌మ అభిమాన న‌టుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భారీ ఎత్తున‌ పోస్టులు చేస్తున్నారు. 

అయితే ఈ ప్రమాదంపై పోలీసులు స్పందిచారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా సాయిధరమ్ తేజ్‌ ప్రయాణిస్తున్న స్పోర్ట్‌ బైక్ ప్రమాదానికి గురైందని  తెలిపారు. ప్రమాద సమయంలో సాయి తేజ్ హెల్మెట్‌ పెట్టుకున్నాడ‌నీ, రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయిందని, బైక్‌ను అదుపు చేయలేకపోవ‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిపారు. 

సాయిధరమ్‌తేజ్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టమున్న‌ట్లు తెలుస్తుంది. ఆయ‌న‌ రెగ్యులర్‌గా రేసింగ్‌లకు వెళతాడనీ, షూటింగ్‌లకు కూడా బైక్‌పై వెళ్లడానికే ఎక్కువగా ఇష్టపడతాడనీ తెలుస్తుంది.  ప్రతిసారి హెల్మెట్‌తో పాటు బైక్‌సూట్‌, నీ ప్యాడ్స్‌ ఎప్పుడూ ధరించేవాడ‌నీ తెలుస్తుంది. అలాగే రెగ్యులర్‌గా వీకెండ్‌ పార్టీలకు హ‌జ‌రవుతాడ‌నీ, ఆ స‌మ‌యంలో ఫ్రెండ్స్‌తో క‌లిసి రేసింగ్ చేసేవాడ‌ని వినికిడి. నిన్న కూడా  నటుడు సందీప్‌ కిషన్‌, వైవా హర్ష, నరేశ్‌ కుమారుడు అంతా కలసి రైడింగ్‌కు వెళ్లేవారని తెలుస్తోంది.

More Related Stories