English   

Sai dharam tej bike నెటింట్లో ఆరా..! మెగా హీరో స్పోర్ట్స్ బైక్ విలువెంత‌? 

 మెగా హీరో స్పోర్ట్స్ బైక్
2021-09-11 13:00:50

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్పోర్ట్స్‌ బైక్ పై ప్ర‌యాణిస్తుండ‌గా ప్రమాదం జ‌రిగింది. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వెంట‌నే ఆయ‌న స‌మీపంలో మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి తీసుక‌వెళ్లారు. అనంత‌రం మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో త‌ర‌లించారు. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్తితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు హెల్త్ బులిటెన్ లో వెల్ల‌డించారు. 

ఇదిలాఉంటే.. నెటిజ‌న్లు మాత్రం చాలా విచిత్ర‌మైన  ఆంశాల‌పై ఆరా తీస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ బైక్ విలువెంత‌? ఆయ‌న  వాడే స్పోర్ట్ బైక్  నెంబ‌ర్ ఎంత? ఆ బైక్ ఎంత సీసీ అనే చిత్ర విచిత్ర ప్ర‌శ్న‌ల‌కు నెటింట్లో స‌మాధానాలు వెతుకున్నారు. యాక్సిడెంట్ కు గురైన ఈ బైక్‌ని రీసెంట్‌గా కొనుగోలు చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. ఈ స్పోర్ట్ బైక్ రిజిస్టేష‌న్ నెంబర్ TS07 GJ1258.ఆ బైక్ ఖరీదు రూ.18లక్షలపై మాటే. ఈ బైక్ సాయి త‌న పేరు మీద కాకుండా అనిల్ కుమార్ అనే వ్య‌క్తి పేరు మీద రిజిస్టేష‌న్ చేయించారు. ఈ స్పోర్ట్స్ బైక్ 1160 సీసీతో నడిచే ట్రంఫ్ బైక్ ఇది.   హై ఎండ్ బైక్ ..దీని బ‌రువు 228 కేజీల వ‌ర‌కు ఉంటుంది.

మ‌రో ఇన్‌ట్రెస్టింగ్ అంశ‌మేమిటంటే.. సాయి ధ‌ర‌మ్ తేజ‌కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమంటా. షూటింగ్ విరామ స‌మ‌యంలో స్నేహితులతో క‌లిసి బైక్ రైడింగ్ కు వెళతాడు. అలాగే శుక్ర‌వారం కూడా నటుడు సందీప్‌ కిషన్‌, వైవా హర్ష, నరేశ్‌ కుమారుడు అంతా కలసి రైడింగ్‌కు వెళ్లేవారని తెలుస్తోంది.  ప్ర‌మాదం స‌మయంలో సాయి హెల్మెట్ ధ‌రించి ఉండటంతో పెను ప్ర‌మాదం నుంచి తప్పించుకోగలిగాడు.

More Related Stories