English   

బాలయ్య మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.

Mythri movie makers gave clarification about nbk 107 title
2021-09-16 05:13:33

నందమూరి నటి సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇది బాలయ్యకు 107వ చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతకీ అందులో ఏమున్నదంటే.. ఎన్‌బీకే 107 మూవీ టైటిల్‌ ఇదేనంటూ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు వాస్తవం కాదు. ఆ సినిమాకి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. అయితే ఇలాంటివి చూస్తే ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుస్తోంది. ఆ మూవీకి కరెక్ట్ గా సరిపోయే టైటిల్‌ని, అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తాం అని తెలియచేశారు.

More Related Stories