English   

ఆది సాయి కుమార్ ‘అతిధి దేవో భవ’ నుండి సిద్ శ్రీ‌రామ్ పాడిన‌ ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ పాట విడుద‌ల‌

Adhi Saikumar Athidhidevobhava movie song release
2021-09-28 23:14:13

ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’. శ్రీనివాస క్రియేషన్స్ ప‌తాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మొద‌టిపాట‌గా ఓ ప్రేమ గీతాన్ని విడుద‌ల‌చేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తోంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ సాగే ఈ గీతానికి భాస్కర భట్ల సాహిత్యం అందించ‌గా లేటెస్ట్‌ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, నూతన మోహన కలిసి ఈ పాటను ఆలపించారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు సమకూర్చారు. యూత్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

ఈ పాటతో సినిమా మీద అంచనాలు మ‌రింత‌ పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతోన్నారు. ఈ సినిమాకు అమరనాథ్ బొమ్మిరెడ్డి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

More Related Stories