English   

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న డాక్టర్ సాబ్.. చూశారా?

doctor saab
2021-09-30 20:22:30

అన్ని వృత్తులలో వైద్య వృత్తి ఎంత గొప్పదో వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలైనా డాక్టర్ చేతిలోనే నయమవుతుంది. ఎన్నెన్నో కొత్త కొత్త వైరస్ లు వచ్చిన వెంటనే వాటిని అంతం చేయడానికి తమ వైద్య పరిజ్ఞానంతో బాగా ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి డాక్టర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ వివరణను మనకు సినిమా ద్వారా చూపించడానికి  ముందుకు వచ్చారు దర్శకనిర్మాతలు.

 డి.ఎస్.బి దర్శకత్వంలో పొందుతున్న సినిమా 'డాక్టర్ సాబ్'. ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు అమ్మ పండు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. నిత్యం డాక్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులను, పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఇటీవలే  ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది.

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఎస్.పీ కొన్ని వివరాలను తెలిపారు. తన స్నేహితుడు డైరెక్టర్ డి.ఎస్.బి ఈ కథను సిద్ధం చేశాడని.. స్క్రిప్ట్ కూడా బాగా కుదిరిందని తెలిపాడు. ఇక ఈ సినిమాను ఈ మధ్యకాలంలో మొదటి షెడ్యూల్ ను ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా అనుకున్నది అనుకున్నట్లు గానే చేశామని తెలిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్ ను ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వీలైనంత త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మొత్తానికి ఈ సినిమా ద్వారా డాక్టర్ల గొప్పదనం ఏంటో మరోసారి తెలుసుకోవచ్చు.

More Related Stories