English   

ఎమోషనల్ జర్నీగా అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌.

Most Eligible Bachelor Trailer launch
2021-10-01 22:08:35

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రతీ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. 2.04 నిమిషాల ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మధ్యలో పెళ్లి, పార్ట్‌నర్ గురించి వచ్చే మాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

More Related Stories